విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20వ తారీకున పుట్టిన విజయనిర్మల నటిగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా పలు భాషల్లో సినిమాల్లో నటించి మిగతా ఈ హీరోయిన్లు సాధించలేని కొన్ని అవార్డ్స్ ని, రివార్డుని దక్కించుకుంది.44 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఆమె స్థానం పదిలంగా ఉంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలుత 1950లో నటిగా మొదటిసారి తెరపై కనిపించిన విజయ నిర్మల 2016లో శ్రీ శ్రీ అనే ఒక సినిమాలో చివరిసారిగా కనిపించింది.2019 జూన్ 27వ తారీకున ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.
ఇక్కడ వరకు మనకు అన్ని విషయాలు తెలిసినవే.అయితే ఆమె వ్యక్తిగత జీవితం కూడా కొంత వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.చిన్నతనం నుంచి సినిమాలంటే ఎంతో మక్కువ ఉండేది విజయనిర్మలకు.ఆమె తండ్రి ప్రొడ్యూసర్ కావడంతో ఈజీగానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగలిగింది.
అలాగే ఆమె కుటుంబంలో నిడదవోలు వెంకట్రావు, జయ సుధ వంటి స్టార్స్ కూడా ఉండడంతో ఆమెకు సినిమా ఇండస్ట్రీపై ఎంతో ఆసక్తి ఉంది.అయితే ఆమె హీరోయిన్ గా నటించాలని భావించిన తరుణంలో పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు ఆమె తండ్రి.
అతి చిన్న వయసులో పెళ్లి కావడం వెనువెంటనే 14 ఏళ్లకే తల్లి కావడంతో ఆమె హీరోయిన్ గా నటించిన కోరిక చంపుకోలేకపోయింది.చంటి పిల్లాడిని ఇంట్లో వదిలేసి సినిమాలో నటించడానికి వెళ్లిపోయేది.
అలా సినిమాలపై ఉన్న మక్కువతో ఏకంగా కొన్ని వందల సినిమాల్లో నటించింది.ఇక ఆమెను పెళ్లి చేసుకున్న మొదటి భర్త పేరు కృష్ణమూర్తి.వీరు మద్రాస్ లోనే ఉండేవారు కృష్ణమూర్తి తో విజయనిర్మలకి నరేష్ అనే కొడుకు పుట్టాడనే విషయం మాత్రమే మన అందరికి తెలుసు.కానీ నరేష్ కాకుండా సురేష్ అనే మరో కుమారుడు ఉన్నాడు అన్న సంగతి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నరేష్ విజయ నిర్మలతో చెన్నై నుంచి హైదరాబాద్ కి రాగా కృష్ణమూర్తి దగ్గరే సురేష్ ఉండిపోయాడు.వీరి విడాకుల సమయంలో అదే ఒప్పందం చేసుకొని ఎవరితో దారి వారు చూసుకున్నారు.
అలా తన కొడుకుని తన భర్త దగ్గరే వదిలేసి తన మరొక కొడుకు అయినా నరేష్ ని తనతో ఉంచుకొని ఇండస్ట్రీలో బిజీగా మారింది.ఆ తర్వాత సాక్షి సినిమాతో మొదటిసారిగా కృష్ణని కలిసింది ఆ తర్వాత రెండేళ్లకే వీరి ప్రేమ కాస్త పెళ్లిగా మారింది.
అలా తన కన్న కొడుకుని సైతం సినిమాల కోసం భర్త దగ్గరే వదిలేసి వచ్చింది అని అపవాదు సైతం మూటగట్టుకుంది విజయ నిర్మల.