కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వం వహించిన దేవర సినిమా( Devara movie ) తాజాగా విడుదల అయింది.ఇందులో ఎన్టీఆర్ జాన్వి కపూర్ కలిసి నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కూడా విడుదలైన విషయం తెలిసిందే.
విడుదలైన ప్రతి చోటా కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.దీంతో బాక్సాఫీస్ వద్ద దేవర దండయాత్ర మొదలయ్యింది.
సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఇక ఇందులో ఎన్టీఆర్ ( NTR )నటన అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమాను నడిపాడు ఎన్టీఆర్.ఇకపోతే ఇందులో తారక్ తర్వాత సినిమాకు మరింత ప్లస్ అయ్యారు అని ఎవరి పేరు చెప్పాలంటే అది అనిరుధ్ పేరే చెప్పాలి.
ఎందుకంటె అనిరుధ్( Anirudh ) బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్ళాడు.నార్మల్ సీన్స్ ను కూడా తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఒక పీక్ స్టేజ్ లో నిలబెట్టేసాడు అనిరుధ్.
కాగా దేవర ఇంటర్వ్యూ లో ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని ఉందని చెప్పిన అనిరుధ్ తమిళనాడులోని వెట్రి థియేటర్ లో( Vetri Theater in Tamil Nadu ) నందమూరి ఫ్యాన్స్ సమక్షంలో బెన్ ఫిట్ షో కు హాజరయ్యాడు.
సినిమాను చూస్తూ ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేశాడు అనిరుధ్.అనంతరం వందల మంది అభిమానుల సమక్షంలో పాట పడుతూ ఫ్యాన్స్ కు ఎనర్జీ ఇచ్చాడు అనిరుధ్.వాసవానికి ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీర రాఘవకు అనిరుధ్ సంగీతం అందించాల్సి ఉంది.
కానీ అనుకోని కారణాల వలన తప్పుకోవాల్సి వచ్చింది.తాజాగా విడుదలైన దేవర తో అనిరుధ్ ఆ బాకీ తీర్చేసాడని చెప్పాలి.
అనిరుధ్ సంగీతానికి యంగ్ టైగర్ డాన్సులకు థియేటర్లు మారుమోగాయి.ఫ్యాన్స్ మధ్య సినిమా చూస్తూ తమ సినిమాకు ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు అనిరుధ్.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనిరుద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తారక్ అభిమానులు.