కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ ( Koratala Siva, Jr.NTR )కాంబోలో రూపొందిన ‘దేవర: పార్ట్ 1’( ‘Devara: Part 1’ ) సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.జూ.ఎన్టీఆర్ ఇందులో డ్యూయల్ రోల్స్ చేశాడు.సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తే, జాన్వీ కపూర్ గ్లామర్ డాల్‌గా కనిపించింది.ఈ స్టార్ క్యాస్ట్‌ని తీసుకురావడమే కాకుండా ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా బాగా డబ్బులు పెట్టారు.
టైమ్ కూడా కేటాయించారు.అయినా, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
ఎన్టీఆర్ సాలిడ్ పర్ఫామెన్స్ కనబరిచినా, అనిరుధ్ నెక్స్ట్ లెవెల్ బిజిఎం అందించినా ఈ మూవీ అనుకున్న స్థాయిలో పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది.
కొరటాల శివ రాసిన రొటీన్ స్టోరీ, అందించిన పూర్ డైరెక్షన్ ఈ మూవీకి పెద్ద మైనస్ అయ్యాయని అంటున్నారు.
ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ కూడా చాలా స్లోగా నడుస్తుంది స్క్రీన్ ప్లే కూడా పెద్దగా ఆకట్టుకునేలాగా ఉండదు.ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు బాగుండటం వల్ల ఫస్టాఫ్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది.“ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది, పర్లేదు, సెకండాఫ్ బాగుంటుందేమో” అని ప్రేక్షకులు అనుకున్నారు కానీ కొరటాల శివ పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు.సెకండాఫ్ చాలా బోరింగ్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులకు విరక్తి పుట్టింది.
సెకండాఫ్ మొత్తంలో స్టాండ్ ఔట్ అయ్యే ఒక్క మూమెంట్ కూడా లేకపోవడం ఈ మూవీకి పెద్ద ఎదురుదెబ్బ అయింది.దేవర పార్టు 2లో మిగతా కథ చూపించాలనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ లేకుండా బోరింగ్ గా తీసినట్లు అనిపించింది.
క్లైమాక్స్ ట్విస్ట్ ( Climax twist )కూడా ఏదో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి కదా అన్నట్లు బలవంతంగా జొపించ్చినట్లు ఉంది.కొరటాల శివ చేసిన ఈ తప్పుల వల్లే దేవర సినిమాకి ఎన్ని పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయో అదే సంఖ్యలో నెగటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి.నెగిటివ్ టాక్ వినిపిస్తుందంటే దానికి ప్రధాన కారణం కొరటాల శివ చేసిన ఈ చిన్న తప్పులే.వీటిని సరిచేసుకొని ఉన్నట్లయితే ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయ్యేది.
అలానే, ఈ సినిమాలో ఫస్టాఫ్ స్టోరీని సెకండాఫ్ లో పెట్టి సెకండాఫ్ స్టోరీని ఫస్టాఫ్ లో పెట్టి ఉంటే బాగుండేది.అలా స్వాప్ చేసినా ఒక ఎలివేషన్ అనేది వచ్చేది, ప్రేక్షకులు తృప్తిగా థియేటర్ల నుంచి బయటికి వచ్చేవారు.నిజానికి ఇలా రెండిటినీ స్వాప్ చేసిన సినిమా కథ చిందరవందరగా అవ్వదు.అలా చేస్తేనే సినిమా మంచిగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు.ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలి కాబట్టి, బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి కాబట్టి ఆమెను ఏదో పేరుకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కథ రొటీన్ గా కాకుండా కొత్తగా రాసుకొని ఉంటే బాగుండేది.పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీద్దామని కొరటాల శివ తడబడ్డాడు.
ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం బాగా డబ్బులు ఖర్చు చేశామని చెబుతున్నారు కానీ ఎక్కడా క్వాలిటీ గ్రాఫిక్స్ కనిపించలేదు సముద్రం కూడా రియలిస్టిక్ గా కనిపించలేదు.ఏదో స్విమ్మింగ్ పూల్ లో సెట్ వేసి మమ అనిపించేసినట్లు అనిపించింది.