అదిరిపోయే యాక్షన్ సినిమాలు తీస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను.భారీ హిట్స్ సాధించడమే కాకుండా రెండు నంది అవార్డులను కూడా గెలుచుకున్నాడు.
సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో బోయపాటి శ్రీను ( Boyapati Srinu )రేంజ్ ఏ టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ అందుకోలేని స్థాయికి ఎదిగింది.బాలకృష్ణ కారణంగానే బోయపాటి స్టార్ డైరెక్టర్ అయిపోయాడని అందరూ అంటారు.
అందువల్ల బోయపాటి శ్రీను తెలుగులో ఏ హీరోకి ఇవ్వని రెస్పెక్ట్ బాలకృష్ణకు ఇస్తాడని అంటారు.అది నిజమే కానీ బాలయ్య బాబు( Balayya Babu ) కంటే మరొక హీరో అంటే బోయపాటి శ్రీనుకు చాలా ఇష్టం, అంతేకాదు గౌరవం కూడా.
ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Stylish star Allu Arjun ).అదేంటి బన్నీతో కలిసి బోయపాటి ఒక సినిమానే తీశాడు కదా, మరి బన్నీ మీద బాలకృష్ణ కంటే ఎందుకు ఎక్కువ ప్రేమ పెంచుకున్నాడు? అనే కదా మీ సందేహం.ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే చాలా కాలం వెనక్కి వెళ్లాల్సిందే.అది 2005 సంవత్సరం.ఆ సమయంలో ఇంకా దర్శకుడిగా బోయపాటి శ్రీను పరిచయం కాలేదు.భద్ర సినిమా ( Bhadra movie )స్టోరీ పట్టుకొని అల్లు అర్జున్ వద్దకు వెళ్లాడు.
అయితే ఆ సమయంలో బన్నీ వేరే సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడట.అందుకే ఈ మూవీ చేయలేకపోయాడు.
కానీ భద్ర స్టోరీ మాత్రం బన్నీకి బాగా నచ్చింది.అందుకే బోయపాటి శ్రీను చేత ఆ సినిమాని తెరకెక్కించడంలో సహాయం చేయాలని బన్నీ నిర్ణయించుకున్నాడు.అందుకే బోయపాటి శ్రీనుని తీసుకెళ్లి ప్రొడ్యూసర్ దిల్ రాజ్( Producer Dil Raju ) కు పరిచయం చేశాడు.అప్పుడు ఈ మాస్ డైరెక్టర్ తన భద్ర స్క్రిప్ట్‌ని దిల్ రాజుకి చెప్పగా, అతను వెంటనే స్క్రిప్ట్‌ని ఓకే చేసి సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడు.
అలా బోయపాటి సినిమా పట్టాలెక్కింది.ఐదారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 26 కోట్లు కలెక్ట్ చేసింది.ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో బోయపాటి శ్రీను మాస్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇదంతా బన్నీ చేసిన సహాయం వల్లే సాధ్యమైంది.లేకపోతే భద్ర మూవీ అంత బాగా ఆడి ఉండేది కాదు.ప్రొడ్యూసర్ల ముందుకు రాకపోతే ఆ కథ అలాగే ఉండిపోయేది.
ఈ హెల్ప్ చేశాడు కాబట్టే బన్నీకి బోయపాటి ఎప్పుడూ గౌరవం ఇస్తాడు.అలాగే బాగా ఇష్టపడతాడు.
వీరిద్దరి కాంబోలో వచ్చిన సరైనోడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.