కాలం మారే కొద్దీ గడిచే కొద్దీ కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే.దేవర సినిమా 2డీతో( Devara movie with 2D ) పాటు 4డీఎక్స్ టెక్నాలజీలో సైతం విడుదలవుతోంది.
ఈ టెక్నాలజీని త్రీడీని మించిన టెక్నాలజీ కాగా ఈ టెక్నాలజీలో సినిమాను చూస్తే మాత్రం కలిగే అనుభూతి మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.
4డీఎక్స్ టెక్నాలజీలో( 4DX technology ) సీట్స్ కు సైతం ఫిజికల్ ఎఫెక్ట్స్ ఉండటంతో ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్లలో సినిమా చూస్తే కలిగే అనుభూతి మామూలుగా ఉండదని చెప్పవచ్చు.షార్క్ ఫైట్ సీన్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
జాన్వీ కపూర్( Janhvi Kapoor ) గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ఆర్.ఆర్.ఆర్ విడుదలైన రెండున్నర సంవత్సరాల తర్వాత విడుదలవుతూ ఉండటం దేవరకు మరింత ప్లస్ కానుంది.మరికొన్ని రోజుల్లో దసరా పండుగ సెలవులు మొదలుకానున్నాయనే సంగతి తెలిసిందే.
ఆ సెలవులను ఈ సినిమా పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
మరికొన్ని వారాల పాటు దేవర సినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవర మూవీ ట్విస్ట్ లకు మైండ్ బ్లాంక్ కావడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.చిత్రయూనిట్ ఇప్పటికే ఈ సినిమాను చూసిందని సినిమా రిజల్ట్ విషయంలో సందేహం అక్కర్లేదని చిత్రయూనిట్ భావిస్తోందని భోగట్టా.
ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు జాగరణే అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కొన్ని ప్రాంతాలలో బెనిఫిట్ షోలకు అనుమతులు రాలేదని భోగట్టా.