సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవ్వాలనే తాపత్రయం ఎంతగా పెరిగిపోయిందంటే కంటెంట్ క్రియేటర్లు తమ ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు.అందరూ అద్భుతమైన ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేసి ఎక్కువ లైక్స్, వ్యూస్ రావాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ కోరిక కొంతమందిని ప్రమాదంలోకి నెట్టివేస్తోంది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో దీనికి ఉదాహరణ.
నిషాంత్ శర్మ ( Nishant Sharma )అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఒక యువతి హైవే మధ్యలోనే ‘షీషే కీ ఉమర్’( Sheeshe Ki Umar ) అనే పాటకు డాన్స్ చేస్తోంది.తన చుట్టూ ఉన్న ప్రమాదాలను పట్టించుకోకుండా ఆనందిస్తోంది.
ఈ వైరల్ వీడియోలో, యువతి హైవే మీద డాన్స్ చేస్తుండగా ఆమె వెనుక ఒక అంకుల్ నిలబడి ఉన్నాడు.కానీ ఇలా హైవే మీద ప్రాణాలకు తెగించి డాన్స్( Dance ) చేయడం చాలా భయంకరమైన విషయం.సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తాపత్రయం వల్ల ప్రజలు ఎంత దూరం వెళ్లగలరో ఈ వీడియో చెప్పకనే చెబుతోంది.ఈ వీడియో పోస్ట్ చేసిన నిషాంత్ శర్మ, “రీల్ చేయాలనే ఉద్దేశంతో హైవేనే కదిలించేశారు” అని రాశారు.
ఈ వీడియో లక్షల వ్యూస్ తో విపరీతంగా వైరల్ అయింది కానీ దీనివల్ల ఆమెకు వచ్చిందేమీ లేదు.పైగా ఆమెను చాలా మంది తిట్టిపోశారు.ఏదైనా వాహనం వచ్చి ఢీకొంటే పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేశారు.రోడ్డు సేఫ్టీ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా డాన్స్ చేయడం వల్ల తన ప్రాణానికి మాత్రమే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది.
ఇలాంటి పబ్లిక్ డ్యాన్స్‌లు ప్రమాదాలకు దారితీయవచ్చు.కొన్నిసార్లు, ఇది క్రియేటివిటీ అని, నిర్లక్ష్యం అని చెప్పడం కష్టం.ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.