ప్రస్తుతం ప్రముఖ యూట్యూబర్ అయిన హర్ష సాయిపై( Harsha Sai ) కేసు నమోదు అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇటీవల నర్సింగ్ పోలీస్ స్టేషన్లో తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి కంప్లైంట్ చేసింది.
ఈ క్రమంలో తాజాగా హర్ష సాయిపై మరొక ఆడియో బయటికి వచ్చినట్లు సమాచారం.బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై( Betting Apps Promotions ) బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తుంది.
ఈ వివాదానికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే హర్ష సాయి ఇమేజ్ దెబ్బ పడుతుందని కో ప్రొడ్యూసర్, బాధితురాలు వాపోయినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా.దీని ప్రభావం ‘మెగా ‘ సినిమాపై( Mega Movie ) కూడా పడుతుందని బాధితురాలు తెలియచేసింది.
ఈ తరుణంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపివేయాలని బాధితురాలు హర్ష సాయిని కోరగా అతను నిరాకరించినట్లు వారిద్దరి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది.అయితే సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశంలో లోటస్ 360( Lotus 360 ) అనే బెట్టింగ్ యాప్ ను నిషేధించింది.
ఈ తరుణంలో నిషేధించిన బెట్టింగ్ యాప్ లింకు తన వీడియోలో పెడితే 10 కోట్లైనా ఇస్తారు అంటూ బాధితురాలితో ఆడియోలో హర్ష సాయి చెప్పినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా., బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం ఎన్ని కోట్లయినా తీసుకుంటారని కఠినంగా చెప్పినట్లు తెలుస్తోంది.బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయించుకుంటారని హర్ష వాపోయాడు.
అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కచ్చితంగా ప్రమోషన్ చేస్తానని అవి నా మార్కెట్ ర్యాలీని పెంచుతాయి అంటూ హర్ష సాయి తెలిపినట్లు సమాచారం.ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్న కానీ హర్ష సాయి తాను చేసింది తప్పు కాదు అంటూ సమర్ధించుకుంటున్నాడు.
చూడాలి మరి చివరికి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో.