రాజన్న సిరిసిల్ల జిల్లా: పాఠశాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వేములవాడ అగ్నిమాపక అధికారులు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పట్టణంలోని హంసని డిజీ హై స్కూల్లో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయోగాత్మకంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి అనిల్ కుమార్, సిబ్బంది రాజేంద్రప్రసాద్, రాజేశం, ప్రేమ్చంద్, పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.