రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సి ఏం కప్ పోటీల్లో విజేతలకు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సబేరా బేగం ప్రథమ,ద్వితీయ బహుమతుల ను గురువారం ప్రదానం చేశారు.కోకో మహిళా విభాగములో మొదటి బహుమతి అల్మాస్ పూర్ జట్టు ,రెండవ బహుమతి వెంకటాపూర్ జట్టు గెలుచుకుంది.
కోకో పురుషుల విభాగములో మొదటి బహుమతి బొప్పాపూర్ జట్టు , రెండవ బహుమతి బాకురుపల్లె జట్టు కైవసం చేసుకున్నాయి.కబడ్డీ మహిళా విభాగములో మొదటి బహుమతి అల్మాస్ పూర్ జట్టు, రెండవ బహుమతి బొప్పాపూర్ జట్టు గెలుచుకుంది.
కబడ్డీ పురుషుల విభాగములో మొదటి బహుమతి అల్మాస్ పూర్ జట్టు,రెండవ బహుమతి గొల్లపల్లి జట్టు దక్కించుకుంది.
వాలీబాల్ మహిళా విభాగములో మొదటి బహుమతి బొప్పాపూర్ జట్టు , రెండవ బహుమతి అల్మాస్ పూర్ జట్టు లు కైవసం చేసుకున్నాయి.
వాలీబాల్ పురుషులు విభాగములో మొదటి బహుమతి బొప్పాపూర్ జట్టు ,రెండవ బహుమతి హరిదాస్ నగర్ జట్టు లు గెలుచుకోగా ఆ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేర బేగం గౌస్ మాట్లాడుతూ చదువుతో పాటు యువత క్రీడారంగంలో ముందుండాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని, ఇలాగే జిల్లాస్థాయి పోటీలలో సైతం గెలుపొందాలని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్ తో పాటు మండల ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం,మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్తయ్య , తహసీల్దార్ రాం చందర్, మండల విద్యాధికారి కృష్ణ హరి ,పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ , ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ పాఠశాలల పిడి, పిఈటిలు,విద్యార్థులు పాల్గొన్నారు.