అందరికీ ఆదర్శనీయుడు అంబేడ్కర్!

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ నందు రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ముందస్తు వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కేక్ కోసి, ఆయన గొప్పతనాన్ని వివరించడం జరిగింది.

 Ambedkar Is Ideal For All , Ambedkar Jayanti ,sampathi Ramesh ,constitution Of I-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సంపతి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా గుర్తించబడిన అంబేడ్కర్ బాల్య దశలో అనేక అవమానాలకు ఎదుర్కొన్నాడు.అయినప్పటికీ గొప్ప సంకల్పంతో ఉన్నత చదువులు చదివాడు.

భారత పరిపాలన గ్రంధమైన భారత రాజ్యాంగాన్ని రాసి మనందరి తలరాతలను మార్చిన మహనీయుడు.అందరికీ ఓటు హక్కును కల్పించి, సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేశాడు.

నేడు రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ద్వారానే మనమందరం ఉన్నతంగా జీవిస్తున్నాము.

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 14 న ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం భారతీయులందరికీ గర్వకారణం.

ఆయన ఖ్యాతిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరించనుంది.ఇది దేశంలోని అతి ఎత్తైన స్మారక చిహ్నంగా నిలవనుంది.

అదేవిధంగా ఇటివల తెలంగాణ సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టడం ఆయన గొప్పదానికి ఇవే నిదర్శనం.కావునా ప్రతి విద్యార్థి బాల్య దశ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని కలిగి ఉండాలి.

జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అధైర్య పడకుండా అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలన్నారు.అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎదగాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు అఖిల, రేణుక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube