మామూలుగా భార్య ప్రెగ్నెంట్ ఉంటే భర్త కాళ్ళు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు.ఏ భర్త అయినా భార్య గర్భవతి ఉన్న సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.
జాగ్రత్తలు కొన్ని కొన్ని సమయంలో చూసే వారికి బాగా అతిగా అనిపిస్తూ ఉంటాయి.లోకంలో మరెవ్వరూ గర్భవతి కాన్నట్లుగా చేస్తున్నారు అంటే నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటారు.
ఇప్పుడు రామ్ చరణ్( Ram Charan ) విషయంలో కూడా అదే జరుగుతుంది.టాలీవుడ్ లో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు మెగా వారసుడు రామ్ చరణ్.
తండ్రికి తగ్గట్టుగా పేరు సంపాదించుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.వ్యక్తిగతంగా కూడా మంచి మనసున్న వ్యక్తిగా నిలిచాడు.
ఎప్పుడు కూడా ఎటువంటి విమర్శలను దరి చేరనివ్వలేదు.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత కూడా భార్య సపోర్టుతో సినిమాలలో నటించాడు.ఇక ఈ జంట ఇప్పటికి అన్యోన్య దంపతులుగా ఉన్నారు.గత ఏడాదే ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసింది.అప్పటినుంచి ఉపాసనకు సంబంధించిన ఏ వార్త వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.పైగా ఉపాసన ప్రెగ్నెంట్ కాబట్టి ఆమె ఏ పని చేసినా కూడా వైరల్ అవుతుంది.అయితే ఉపాసన( upasana ) ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా భర్తని తీసుకొని విదేశాలకు తిరుగుతూ తన ప్రెగ్నెన్సీ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తుంది.
నాచురల్ గా బిడ్డను కనాలని ఆమె తన భర్తతో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది.రామ్ చరణ్ కూడా ఉపాసన ఏది చెప్పినా కూడా అదే చేస్తున్నాడు.
ఆమెకు కావాల్సినవన్నీ అందిస్తున్నాడు.

ఆమె కోసం సమయం కేటాయిస్తున్నాడు.పైగా పది సంవత్సరాలకు ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రామ్ చరణ్.ఆమె బాగోగులు దగ్గర ఉండి చూసుకుంటున్నాడు.
దీంతో రామ్ చరణ్ తన భార్య పట్ల ఇంత జాగ్రత్తలు తీసుకోవడంతో కొందరు కావాలని బాగా విమర్శలు చేస్తున్నారు.నిజానికి రామ్ చరణ్ ఒక భర్తగా గర్భవతి ఉన్న భార్యకు ఎటువంటి సేవలు చేయాలో అవే చేస్తున్నాడు.

కానీ కొంతమంది ఆకతాయిలు.రామ్ చరణ్ ను బాగా టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు.తన భార్య ప్రెగ్నెంట్ అని చరణ్ బాగా ఓవర్ చేస్తున్నాడు అంటూ.ఆమె ఒక్కతే ప్రెగ్నెంట్ అయ్యిందా ఏంటి అంటూ బాగా విమర్శలు చేస్తున్నారు.దీంతో మెగా అభిమానులు తిరిగి వారికి తమదైన స్టైల్ లో సమాధానాలు ఇస్తున్నారు.భార్యను భర్త కాకుంటే ఇంకెవరు చూసుకుంటారు అంటూ అదిరిపోయే కౌంటర్లు వేస్తున్నారు.
రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు భార్యను చూసుకుంటున్నాడు.







