రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు.ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోని బాలుర వసతి గృహం, ఇల్లంతకుంటలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా హాస్టల్ ఆవరణ, పరిసరాలు, అనంతరం వసతి గదులు, కిచెన్, స్టోర్ రూంలో ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు పరిశీలించారు.అనంతరం ఆయా విద్యాలయాల్లో విద్యార్థులతో ఆకునూరి మురళి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడారు.విద్యార్థులు ఇష్టపడి చదవాలని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోని తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు.పోటీ పరీక్షలలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పేర్కొన్నారు.
ఈ పర్యటనలో డీఈఓ రమేష్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజ మనోహర్, అధికారులు, ఉప్పద్యాయులు తదితరులు పాల్గొన్నారు
.