మహిళలకు వెంటనే కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సోదరీమణులందరికీ వెంటనే సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీమంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి విలేకరులతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు బ్రేక్ డ్యాన్స్ చేసుకోవచ్చని సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఆయన తప్పు పట్టారు.10 సంవత్సరాల పరిపాలనలో బిఆర్ఎస్ పార్టీకి మహిళలు యాధికి రాలేదని మహిళలకు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణము కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడంతో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు, పదేళ్ల కాలంలో మహిళలకు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు, టిఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు , కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారెంటీ ల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు , అధికారం కోల్పోయి బిఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినట్లు బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.కేటీఆర్ డౌన్ డౌన్ మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు , కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , మెండే శ్రీనివాస్ యాదవ్ , గుండాడి రాంరెడ్డి , కొత్తపెళ్లి దేవయ్య, దండు శ్రీనివాస్, రఫీక్ , లక్ష్మణ్ ముదిరాజ్, , దొమ్మటి రాజు, శెట్టిపల్లి బాలయ్య,రాజయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

 Ktr Should Apologize To Women Immediately , Ktr , Sheikh Gaus Bai, Trs Party-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube