రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla District ) నందు ఆగష్టు 2024 నెలలో సదరం శిబిరములు నిర్వహణ కొరకు సంబంధిత వైద్యులు సూచించిన తేదిల ప్రకారం ఆయా విభాగాలు అనగా కంటిచూపు, వినికిడి, ఆర్థో, మానసిక వైకల్యాలకు సంబంధించి ఈ దిగువన తెలిపిన తేదిలలో క్యాంపులు నిర్వహించుటకు ప్రకటించారు.ఇట్టి తేదీలను మీ ద్వారా మీ సేవ నందు ఆన్ లైన్ షెడ్యుల్ నందు పెట్టుటకు కోరనైనది.
మీ సేవ కేంద్రాల( Mee Seva centers ) ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులకు మాత్రమే సదరం శిభిరం నిర్వహించబడును.కావున ఈ విషయాన్ని మండల అభివృద్ధి అధికారులు, కమీషనర్లకు ( సిరిసిల్ల, వేములవాడ) తెలియపరచి వారి పరిధిలోని వారికి సమాచారం అందేలా చూడగలరని కోరారు.
స్థలము :
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల
శిబిరాలు నిర్వహించే తేదీలు
08.08.2024 , కంటిచూపు-25 (నూతన), 05-(రినిపల్) , 21.08.2024 వినికిడి-30 (నూతన), 10 (రినివల్) , ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, రాజన్న సిరిసిల్ల, 23.08.24 ఆర్థో -40(నూతన), 10 (రినివల్) 28.08.2024 , మానసిక-20 (నూతన) 10-(రినివల్)పైన తెలిపిన తేదిలలో సదరం శిబిరంకు హాజరగు దివ్యాంగులు మీసేవ స్లాట్ నందు తప్పులు లేకుండా సరియైన విభాగము నందు, స్లాట్ నమోదు చేసుకుని, సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్-రే మరియు ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకుని ఉదయం 10.00 గంటలకు సదరం శిఖరంకు హాజరు కాగలరని తెలియ జేశారు.