రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం(Chendurthi ) రామరావుపల్లి లోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి ఉపాధ్యాయురాలు రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ… ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమవుతాయి.బిడ్డ పుట్టిన గంటలోపే పాలిచ్చేలా తల్లికి సాయం చేయాలన్నదే వారోత్సవాల ఉద్దేశం.
అమ్మపాలు అమృతం, నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి.ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి.
తల్లి పాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయి.అవి శిశువు పెరుగుదలకు ఉపకరిస్తాయి.
అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే అపోహలు వీడి తప్పకుండా బిడ్డకు పాలు పట్టించాలి.పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే సహజ రోగ నిరోధక శక్తి కలిగేలా చేస్తాయి.
ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి అధికారి నవీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు మమత, కార్యదర్శి వినోద, ఏఎన్ఎం సుమాంజలి, ఆశ వర్కర్ దేవి ప్రియ, సిఏ వీణ, కారోబార్ జల, తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.