రాజన్న సిరీసిల్ల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడాన్ని వేములవాడ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం తీవ్రంగా ఖండించారు.దీనిని నిరసిస్తూ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ పాపన్న విగ్రహం ముందు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లారా ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపాలని, రాష్ట్రంలో మహిళలకు సముచిత గౌరవం కల్పించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, నాయకులు చిలుక రమేష్, పుల్కం రాజు, పాత సత్యలక్ష్మి, ముప్పిడి శ్రీనివాస్, ఇప్ప పూల అజయ్, ఫిర్ మహమ్మద్, ముప్పిడి శ్రీధర్, కొక్కుల బాలకృష్ణ, ఎర్ర శ్రీనివాస్, ఎస్ కే సాబీర్, గొలి తిరుపతి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.