పరేడ్ తోనే క్రమశిక్షణ శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం - ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ శాఖలో నిర్దేశించిన దాని ప్రకారం పరేడ్ నిర్వహించడం వల్ల, పరేడ్ లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ అన్నారు.

 Discipline Physical Fitness Mental Exhilaration With Parade Ellanthakunta Si D S-TeluguStop.com

పోలీస్ శాఖలో నిర్వహించే వీక్లీ పరెడ్ లో భాగంగా ఈరోజు ఉదయం ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వీక్లీ పరేడ్లో పాల్గొన్న సిబ్బందిని ఉద్దేశించి ఎస్సై డి.సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిరంతరం వీక్లీ పరేడ్ కు హాజరుకావాలని తద్వారా క్రమశిక్షణ పెరగడంతో పాటు పోలీస్ శాఖలో నిత్యం జరుగుతున్న విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.పోలీసుల యొక్క క్రమశిక్షణ పరేడ్ తోనే సాధ్యమవుతుందని ఈ క్రమశిక్షణ మూలంగానే సమాజంలో పోలీసులకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు.

ఈ వీక్లీ పరేడ్ లో ఏఎస్సై మోతీరాo, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు మోహన్, అనిల్, రాజు, మధు, అనిల్, హోంగార్డు బాబుచందర్ లు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube