తిమ్మాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ సహకార సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్.కె సబేరా బేగం ప్రారంభించారు.

 Paddy Purchase Center Inagurated In Timmapur, Paddy Purchase Center , Timmapur,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్ల కుప్పలు బాగా పెరిగిపోయాయి అన్నారు.మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన కుదిరిన వెంటనే వడ్లను తూకం వేసి తరలించడం జరుగుతుందన్నారు.

రుణమాఫీ కానీ రైతులకు ఈ నెల చివరి వరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందన్నారు.సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ను ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులు దీనిని వినియోగించుకోవాలన్నారు.

ఐకెపి సహకార సొసైటీ కేంద్రాలలో వ్యాపారులు నేరుగా ధాన్యాన్ని కొనవద్దని చట్ట ప్రకారంగా కేసులు అవుతాయని అన్నారు.నూతన పాలక వర్గ కమిటీని సొసైటీ సహకార కేంద్ర కార్యాలయంలో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సహకార సొసైటీ కార్యాలయంలో సన్మానించారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సహకార సొసైటీ అధ్యక్షులు సుధీర్ రావు,ఉపాధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి, ఎ ఎం సి వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు రాజేందర్,మెండే శ్రీనివాస్, కిష్టా రెడ్డి, నారాయణ రెడ్డి,తిరుపతి రెడ్డి, గంట చిన్న లక్ష్మి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube