దేశంలో రోజూ సరికొత్త డిజిటల్ మోసాలు( Digital Scams ) జరుగుతున్నాయి.హ్యాకర్లు మనల్ని మోసగించడానికి కొత్త మార్గాలను కనుక్కుంటున్నారు.
అలాంటి మోసాలలో ఒకటి “లాంజ్ పాస్”( Lounge Pass App ) అనే ఓ యాప్ ద్వారా జరుగుతుంది.లాంజ్ పాస్ కోసం చాలామంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
కానీ ఈ యాప్లో హానికరమైన కోడ్ను హ్యాకర్లు( Hackers ) రన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ అప్లికేషన్ ఉపయోగించే వారి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బును హ్యాకర్లు దొంగలిస్తున్నారు.
ఇలాంటి సమస్య గురించి చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
![Telugu Bank, Cyber Criminals, Cyber Security, App, Scams, Lounge, Lounge App, Lo Telugu Bank, Cyber Criminals, Cyber Security, App, Scams, Lounge, Lounge App, Lo](https://telugustop.com/wp-content/uploads/2024/10/Behind-The-New-Airport-Lounge-Pass-App-Scam-detailss.jpg)
క్లౌడ్సెక్కు చెందిన థ్రెట్ రీసెర్చ్ టీమ్ ఈ లాంజ్ పాస్ యాప్ పై తాజాగా దృష్టి సారించింది.వారు దీనిని బాగా పరిశీలించి దీనంత డేంజరస్ యాప్ మరొకటి లేదు అని హెచ్చరించారు.ఈ అప్లికేషన్ భారతీయ విమానాశ్రయాలలో విమాన ప్రయాణికులను( Airport Passengers ) టార్గెట్ చేస్తుందని ఆ టీమ్ సభ్యులు పేర్కొన్నారు.loungepass.in వంటి హానికరమైన వెబ్సైట్లలో ఈ అప్లికేషన్ ని ఉంచుతున్నారు.
![Telugu Bank, Cyber Criminals, Cyber Security, App, Scams, Lounge, Lounge App, Lo Telugu Bank, Cyber Criminals, Cyber Security, App, Scams, Lounge, Lounge App, Lo](https://telugustop.com/wp-content/uploads/2024/10/Behind-The-New-Airport-Lounge-Pass-App-Scam-detailsd.jpg)
మోసగాళ్లు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వారి ఫోన్ నెంబర్కు వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్లు తమ ఫోన్ నెంబర్ కి మళ్ళించుకుంటున్నారు.ఈ యాప్ ఎస్ఎంఎస్, ఫోన్ కాల్ పర్మిషన్స్ తీసుకుంటుంది.తద్వారా సైబర్ క్రిమినల్ కంట్రోల్ సర్వర్లకి యూజర్ల ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు వచ్చేలాగా వీళ్ళు చేస్తున్నారు.
తన ఫోన్లో కాల్ ఫార్వార్డింగ్ చేసి, తన ఫోన్ను కంట్రోల్ చేస్తున్నారు.బ్యాంక్ అకౌంట్స్ లోని డీటెయిల్స్ తెలుసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.సైబర్ సెక్యూరిటీ నిపుణులు రివర్స్ ఇంజనీరింగ్ చేసి మరీ ఈ అప్లికేషన్ ఎలా యూజర్లను మోసం చేస్తుందో తెలుసుకున్నారు.ఈ అప్లికేషన్ ఒకటే కాకుండా పెద్దగా తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దని యూజర్లను సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.