సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.అయితే వేట్టయన్ సినిమాతో రజనీకాంత్ కు ఆశించిన ఫలితం దక్కలేదు.
ఈ సినిమా వల్ల రజనీకాంత్ కంగువ సినిమా సైతం వాయిదా పడిందనే సంగతి తెలిసిందే.తాజాగా కంగువ సినిమా( Kanguva ) ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కు రజనీకాంత్ గెస్ట్ గా హాజరవుతారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం ఏ మాత్రం నిజం కాలేదనే సంగతి తెలిసిందే.

ఈ ఈవెంట్ కు రజనీకాంత్ వస్తారని అందరూ భావించినా రజనీకాంత్ ( Rajinikanth )రాకపోవడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ పై సూర్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.రజనీకాంత్ ను సూర్య ఆహ్వానించినా ఆయన హాజరు కాకపోవడం విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.అయితే రజనీకాంత్ ఒక వీడియో మెసేజ్ ను పంపడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

రజనీకాంత్ వీడియోలో డైరెక్టర్ శివతో అన్నాత్తే సినిమా( Rajinikanth Annaatthe ) చేసిన సమయంలొ తన కోసం మంచి హిస్టారికల్ పీరియాడిక్ స్టోరీ రాయాలని సూచించానని శివ అలాంటి కథ రాసినా సూర్యతో సినిమా చేశాడని రజనీకాంత్ కామెంట్లు చేశారు.కంగువా సినిమా నవంబర్ నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.సూర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.
సూర్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు.కంగువా సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
కంగువా సినిమా సెకండ్ పార్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.కంగువా సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.







