వాము.దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది.
చూడడానికి చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ వాములో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.తిన్నది అరగకపోతే నోట్లో కాస్తంత వాము వేసుకోమని పెద్దలు చెబుతుంటారు.
జీర్ణ ఆరోగ్యానికి వాము మేలు చేస్తుందని అందరికీ తెలుసు.కానీ వాముతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
మనం రోజువారీ ఎదుర్కొనే అనేక సమస్యలకు వాముతో చెక్ పెట్టవచ్చు.
సీజన్ మారుతున్నప్పుడు ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు (Cold, cough)సమస్యలను వాముతో వదిలించుకోవచ్చు.
వాము, జీలకర్ర, ధనియాలు(Cumin ,Coriander) మూడింటిని వాటర్ లో మరిగించి కషాయం తయారు చేసుకుని రోజుకు రెండు పూటలా తాగితే ఎలాంటి జలుబు, దగ్గు అయినా పరార్ అవుతాయి.ఈ కషాయం జ్వరాన్ని కూడా హరిస్తుంది.

మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్న వారికి వాము ఒక న్యాచురల్ మెడిసిన్ లా పని చేస్తుంది.రెండు టేబుల్ స్పూన్ల వామును లైట్ గా వేయించి ఒక పల్చటి క్లాత్ లో మూట కట్టి వాసన పీలుస్తూ ఉండాలి.ఈ విధంగా చేస్తే మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందుతారు.డెలివరీ అనంతరం మహిళలు నిత్యం వామును తీసుకోవాలి.వాము తల్లుల్లో చనుబాలు వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తుంది.అలాగే వికారం, వాంతులు ఇబ్బంది పెడుతున్నప్పుడు వామును వేడి నీటిలో నానబెట్టి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి.
ఇలా చేస్తే వికారం, వాంతులు నుంచి రిలీఫ్ పొందుతారు.

వాము, మిరియాలు(ajwain, pepper) మరియు ఉప్పు సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి స్టోర్ చేసుకోవాలి.రోజు భోజనానికి ముందు అర టీ స్పూన్ చొప్పున ఈ చూర్ణాన్ని తీసుకుంటే తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది.అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ వంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
ఇక గొంతు నొప్పి, గొంతులో గరగర(Sore throat, hoarseness in throat) తగ్గాలంటే అర టీ స్పూన్ వామును బుగ్గన పెట్టుకుని నములుతూ రసాన్ని మింగాలి.ఇలా చేస్తే ఆయా సమస్యలు పరారవుతాయి.