రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పండ్లలో జామ( Guava ) ముందు వరుసలో ఉంటుంది.పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ జామపండ్లను ఇష్టంగా తింటుంటారు.
పల్లెటూర్లలో ప్రతి ఇంటికి ఒక జామ చెట్టు ఉంటుంది.అయితే జామపండ్లు ఆకుపచ్చ రంగులో మాత్రమే కాకుండా నలుపు రంగులో కూడా ఉంటాయి.
నలుపు రంగులో ఉండే వాటిని నల్ల జామ( Black Guava ) అంటారు.ఆకుపచ్చ జామతో పోలిస్తే నల్ల జామ ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ.
అందుకు తగ్గా పోషకాలు దానిలో నిండి ఉంటాయి.పైగా నల్ల జామతో అంతులేని ఆరోగ్య లాభాలు పొందుతారు.

సాధారణ జామ పండ్లతో పోలిస్తే, నల్ల జామ పండ్లలో పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.నల్ల జామలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి.క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.అలాగే నల్ల జామ పండ్లు విటమిన్ సి యొక్క గొప్ప మూలం.నిత్యం ఒక నల్ల జామ పండును తింటే రోగ నిరోధక శక్తి( Immunity Power ) పెరుగుతుంది.దాంతో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

నల్ల జామలో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియ మరియు ప్రేగు కదలికలకు మద్దతు ఇస్తుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు నల్ల జామను తమ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమమైన ఎంపిక అవుతుంది.ఎందుకంటే నల్ల జామ జీవక్రియను పెంచడంలో మరియు ఆకలిని అణచివేయడంలో సహాయపడుతుంది.
నల్ల జామలో కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి.ఇవి రక్తహీనత సమస్యకు చెక్ పెడతాయి.
ఎముకలను బలోపేతం చేస్తాయి.నల్ల జామ మీ శరీరంలో సోడియం మరియు పొటాషియం సమతుల్యతను కాపాడుకోవడంలో తోడ్పడుతుంది.
ఇది అధిక రక్తపోటును నిర్వహిస్తుంది.ఇక నల్ల జామలో నొప్పిని తగ్గించే లక్షణాలు కూడా ఉంటాయి.
ఆడవారు నెలసరి సమయంలో నల్ల జామ పండ్లు తింటే చాలా మేలు జరుగుతుంది.







