తెలుగు రాష్ట్రాలలో అప్పుడే దీపావళి పండుగ( Diwali Festival ) వేడుకలు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో చాలామంది ప్రజలు టపాసులను( Crackers ) కొనుక్కోవడానికి ప్రభుత్వాలు చెప్పిన స్థలాలలో ఏర్పాటు చేసిన షాప్స్ దగ్గరకు వెళ్తున్నారు.
అయితే, తాజాగా హైదరాబాద్ మహానగరంలోని( Hyderabad ) సుల్తాన్ బజార్ లోని బొగ్గులకుంటలో పరస్ ఫైర్ వర్క్స్( Paras Fire Works ) దుకాణంలో ఆదివారం రాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ అగ్నిప్రమాదంలో భాగంగా దాదాపు పది ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తుంది.

అయితే, సంఘటన జరిగిన వెంటనే గౌలిగూడ నుంచి నాలుగు ఫైర్ ఇంజన్స్ ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.ఒక్కసారిగా క్రాకర్స్ నిప్పు అంటుకొని భారీ శబ్దాలు రావడం, మంటలు ఏగిసిపడడంతో చుట్టుపక్కల వారు అందరూ కూడా భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు తీసేసారు.ఈ తరుణంలో దట్టమైన పోగతో ఇద్దరు మహిళలకు అస్వస్థకు గురై వెంటనే దగ్గరలోనే ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలియజేశారు.ఈ సంఘటనలో భాగంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.
అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాస్తవానికి అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా మానవ తప్పిదామా అనే కోణంలో పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.అయితే, ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.కానీ, దుకాణం పక్కన ఉన్న బిల్డింగులకు కూడా మంటలు వ్యాపించడంతో తీవ్ర నష్టం ఏర్పడింది.
ఇది ఇలా ఉండగా క్రాకర్స్ కొనుక్కోవడానికి వచ్చిన వినియోగదారుల వాహనాలు కూడా మంటలలో చిక్కుపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ప్రస్తుతం సంఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







