రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?

ప్రస్తుత సోషల్ మీడియాలో పాములకు( Snakes ) సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.ఎక్కడో జనసంచారం లేని చోట్ల ఉండాల్సిన పాములు నివాసిత ప్రాంతాలకు, వాహనాలలోకి కూడా పాములు ప్రవేశించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

 Snake Found On Ac Berth In Vasco-da-gama Express Viral Video Details, Irctc ,r-TeluguStop.com

అయితే ఒక్కోసారి పాములు ఏ ప్రదేశంలో ప్రత్యక్షమవుతాయో కూడా అర్థం అవ్వని పరిస్థితులలో చాలా మంది ఉన్నారు.అచ్చం అలాంటి సంఘటనని ఒకటి సికింద్రాబాద్ – వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైల్లో( Secunderabad – Vasco De Gama Express ) సంభవించింది.

రన్నింగ్ ట్రైన్ లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షం అవ్వడంతో ప్రయాణికులందరూ భయాందోళనకు గురయ్యారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.

సికింద్రాబాద్ నుంచి గోవాకు బయలుదేరిన సికింద్రాబాద్ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ రైలులో ఏసీ 2 టైప్ కోచ్ లో బర్త్ మీద ఏదో కదులుతుందని ఒక ప్రయాణికుడు గమనించాడు.దీంతో ఏమిటా అని బెడ్ షీట్ పక్కకు తీసి చూడగా ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది.దీంతో ప్యాసింజర్ లో అందరూ భయంతో పక్క కోచ్ కు పరుగులు తీసేశారు.ఇక ఈ విషయాన్ని వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించగా తర్వాతి స్టాప్ లో రైల్వే అధికారులు పాములు పట్టే వ్యక్తి ని( Snake Catcher ) పిలిపించారు.

అతను ఎంతో తెలివిగా బెడ్ షీట్ లోనే పామును పట్టుకొని పామును బయటకు తీసుకొని వచ్చాడు.అనంతరం ఆ పామును బయటకు వదిలేయడంతో ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఈ సంఘటనపై అధికారులు స్పందిస్తూ.ప్రయాణికులకు ఎవరికి కూడా ఎటువంటి అపాయం తలెత్తలేదని, ట్రైన్ లోకి పాము ఎలా వచ్చిందనే విషయం పై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలియజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు.కొత్తగా ప్రారంభమైన ట్రైన్ లోకి పాము ఎలా ప్రత్యక్షమైందని కొంతమంది ప్రశ్నిస్తుంటే.ఇక మరికొందరు అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా అని రాసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube