వేములవాడ నియోజకవర్గం పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల పై సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ( Vemulawada Constituency ) పరిధిలోని సాగు నీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి( Uttam Kumar Redd) తో సచివాలయంలోని వారి చాంబర్ లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ భేటి.వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు సాగు నీటి ప్రాజెక్టుల పనుల పురోగతి పై ఈ సమావేశంలో చర్చించారు…శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ టూ ఫేస్ వన్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేసిన మంత్రి.

 Meeting On Irrigation Projects Under Vemulawada Constituency ,vemulawada Consti-TeluguStop.com

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు( Sreepada Yellampalli Project )లో భాగంగా మర్రిపల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ పనుల్లో వేగవంతం చేయాలని సూచించారు.ఇటీవల బడ్జెట్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 325 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

రుద్రంగి నాగారం చెరువు కాల్వపై రైతుల సౌకర్యార్థం బ్రిడ్జిల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, కొనరావుపేట మండలంలోని లచ్చంపేట చెరువును రిజర్వాయర్ గా మార్చే ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు.స్టేజ్ టూ ఫేస్ టూ లో భాగంగా కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి ఎడమ కాల్వలకు సంబంధించి భూ సేకరణ వెంటనే చేపట్టి కాలువ పనులను ప్రారంభించవలసిందిగా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎగువ మానేరు ప్యాకేజ్ 9 పనుల్లో వేగవంతం చేయాలని, మల్కపేట రిజర్వాయర్ లో రైతులకు సరిపడా నీటిని నింపాలని పేర్కొన్నారు.అధికారులు ఎప్పటికప్పుడు సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి పనుల్లో పురోగతిని తెలుసుకోవాలని సూచించారు.

కాగా త్వరలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా వేములవాడ నియోజకవర్గం లోని పలు ప్రాజెక్టులను సందర్శిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube