నేరం చేస్తే శిక్ష తప్పదు,శిక్షల పెంపుతోనే సమాజంలో మార్పు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,కోర్ట్ కానిస్టేబులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి గడిచిన సంవత్సర కాలంలో 61 కేసుల్లో నేరస్తులకు శిక్షలు,మూడు కేసులలో జీవిత ఖైదు పడే విధంగా కృషి చేసిన పీపీ లను,కోర్టు కానిస్టేబుల్ లను ఆభినందించి ప్రసంశ పత్రాలు అందించిన జిల్లా ఎస్పీ.

 Change In The Society Is Only By Increasing The Punishments District Sp Akhil Ma-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….

నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , న్యాయాధికారులు,పోలీస్ అధికారులు సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు మొదలు, కేసు విచారణ, కోర్టులో వచ్చే ట్రయల్, క్రైమ్ డీటెయిల్ ఫారం, ఛార్జ్ షీట్ లలో దొర్లే పొరపాట్లను సరిచేస్తూ సదరు పోలీస్ అధికారులకు సూచన చేయడం, పోలీసు అధికారులు సాక్షులను సరైన పద్దతిలో ప్రొడ్యూస్ చేయు పద్ధతి, మొదలైన అనేక అంశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేయాలని శిక్షల శాతం పెరిగేలా పనిచేసే అధికారులకు,సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

గడిచిన సంవత్సర కాలంలో 61 కి పైగా కేసుల్లో నెరస్థులుగా ఉన్న వారికి జైలు శిక్షలు ,మూడు కేసులలో జీవిత ఖైదు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు.

పై కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పీపీలు,లక్ష్మీ ప్రసాద్ Addl PP 1Addl.Dist and sessions court siricilla and ASJ కోర్టు సిరిసిల్ల,శ్రీనివాస్ Spl PP POCSO court- siricilla and Addl.PP Prl.Dist and sessions court siricilla,లక్ష్మణ్ అడిల్ పీపీ ఏఎస్జే కోర్టు వేములవాడ,సందీప్ APP PDM సిరిసిల్లా ,సతీష్ APP ADM కోర్టు సిరిసిల్ల,విక్రాంత్ APP JFCM వేములవాడ,మరియు అన్ని పోలీస్ స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లను అభినందించి ప్రసంశ పత్రాలు అందించారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ,సి.ఐ లు కృష్ణ, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ సి.ఐ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ శ్రీనివాస్,ఆర్.ఐ లు మధుకర్, రమేష్ కోర్టు కానిస్టేబుల్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube