నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహణకు వేలం వేసిన నలుగురిపై కేసు నమోదు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహణకు వేలం వేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలోని రాళ్లపేట గ్రామస్తులైన మాజీ సర్పంచ్ బాలసాని పరశురాం, బొద్దుల పరుశురాం, గౌర అంజయ్య , సోమ ఎల్లయ్య అనే వ్యక్తులు గ్రామంలో మద్యం అమ్మడానికి బెల్ట్ షాప్ నిర్వహణకు వేలంపాట నిర్వహించగా గణాది శ్రీకాంత్ ను బెల్ట్ షాపు నడుపుకొమ్మని అందుకు 66,500/- రూపాయలు డబ్బులు డిమాండ్ చేయగా,శ్రీకాంత్ ని బెదిరించి అతని వద్ద 33,000/- రూపాయలు పెద్ద మనుషులు తీసుకొనీ మిగతావి ఇవ్వాలని,

 A Case Has Been Registered Against Four People Who Bid For Running A Belt Shop I-TeluguStop.com

గ్రామంలో గణాది శ్రీకాంత్ తప్ప మిగిలిన ఎవ్వరు బెల్ట్ షాప్ నిర్వహించిన వారికి 50 వేల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసిన బాలసాని పరశురాం, బొద్దుల పరుశురాం, గౌర అంజయ్య , సోమ ఎల్లయ్య లపై కేసు నమోదు చేసి పై ముగ్గురిని సిరిసిల్ల మెజిస్ట్రేట్ గారి వద్దకు రిమాండ్ పై పంపించనైనదని, సోమయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు.

గ్రామాల్లో గ్రామాల అభివృద్ధి పేరిట నిబంధనలకు విరుద్ధంగా, చట్టవ్యతిరేకంగా వేలంపాటలు నిర్వహిస్తే చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాంటి ప్రజల దృష్టికి వస్తే పోలీస్ వారికి సమాచారం అందించాలని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube