రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని అన్ని గ్రామాలలో పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఎస్సై రమాకాంత్ తన సిబ్బందితో ఆయా గ్రామాలలో రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రైతులు పండించిన వరి ధాన్యాన్ని రోడ్లపై కుప్పలు కుప్పలుగా ఆరబోసి వచ్చిపోయే
వాహనదారులకు ప్రమాదాలు సంభవిస్తే పూర్తి బాధ్యత రైతు దేనని అన్నారు.రోడ్లపైన వడ్లు ఆరబోసి వాహనదారులకు ప్రమాదల సంభవిస్తే రైతుపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు, పోలీసులు పాల్గొన్నారు.