వర్షాకాలం పోయి చలికాలం మెల్లమెల్లగా ప్రారంభం అవుతోంది.సీజన్ మారుతున్నప్పుడు రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
ఈ జాబితాలో జలుబు, దగ్గు వంటివి ముందు వరుసలో ఉంటాయి.మిమ్మల్ని కూడా జలుబు, దగ్గు( Cold, Cough ) సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా.? ఎన్ని మందులు వాడినా వాటి నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను కనుక తీసుకుంటే ఎలాంటి దగ్గు, జలుబు అయినా పరార్ అవ్వాల్సిందే.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక ఐదు ఫ్రెష్ తులసి ఆకులు, ఐదు పుదీనా ఆకులు వేసుకోవాలి.అలాగే అంగుళం దాల్చిన చెక్క, రెండు అనాస పువ్వులు మరియు రెండు లెమన్ స్లైసెస్ వేసుకుని పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ ఆర్గానిక్ తేనె కలిపి సేవించాలి.

రోజుకి ఒక్కసారి ఈ మ్యాజికల్ డ్రింక్ ను తీసుకుంటే.అందులో ఉండే యాంటీ వైరల్, యాంటీబ్యాక్టీరియల్ ( Anti-viral, Antibacterial )లక్షణాలు మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.జలుబు, దగ్గు కు కారణమయ్యే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తాయి.చాలా వేగంగా ఆయా సమస్యల నుండి ఉపశమనాన్ని కల్పిస్తాయి.అలాగే ఈ మ్యాజికల్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ బర్న్ అవుతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.
అంతేకాదండోయ్.ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు పైన చెప్పుకున్న డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకుంటే క్షణాల్లో రిలీఫ్ పొందుతారు.
మైండ్ ప్రశాంతంగా మారుతుంది.







