రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని,దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజిబుల్ పోలీసింగ్ పై దృష్టిసారించాలని,విలేజ్ పోలీస్ అధికారులు స్టేషన్ పరిధిలోని గ్రామాలు,వార్డులు పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు.
పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని,పెండింగ్లో ఉన్న కేసులు,పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుసుకొని,పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేసిన జిల్లా ఎస్పీ.
అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో 5s అమలు చేసిన తీరు,విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క డ్యూటీల గురించి అడిగి తెలుసుకుని,రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలు క్షుణ్నంగా పరిశీలించారు.
అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ… అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని, పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.
అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా తరచు గ్రామాలు, వార్డులు పర్యటిస్తూ ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులు తెలిసేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు.
దక్షణకాశిగా పేరుగాంచిన వేములవాడ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా, వివిధ ప్రాంతాల నుండి శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విజిబుల్ పోలీసింగ్ అమలు చేస్తూ, స్టేషన్ పరిధిలోని రౌడి షీటర్స్,హిస్టరీ షీటర్స్,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కఠినతరం చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ లు ఏర్పాటు చేయాలని, గంజాయి కిట్ల సహాయంతో అనుమానిత వ్యక్తులకు టెస్ట్ లు నిర్వహించాలని,జిల్లాలో గంజాయి నివారణకు పకడ్బందీగా చర్యలు చెపడుతున్నామని,గంజాయి కి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి లేదా, డయల్100 కి సమాచారం అందించాలన్నారు.
అధికారులకు,సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలి అని సూచించారు.
ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,పట్టణ సి.ఐ వీరప్రసాద్, ఎస్.ఐ లు రమేష్, రాజు, సిబ్బంది ఉన్నారు.