రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత దేశ మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్( Sardar Vallabhbhai Patel ) జయంతి గురువారం కలెక్టరేట్ ఘనంగా నిర్వహించారు.జిల్లా యువజన అండ్ స్పోర్ట్స్ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్ర్య పోరాటం, భారతదేశ నిర్మాణంలో అందించిన సేవలను కొనియాడారు.ఇక్కడ జిల్లా యువజన అండ్ స్పోర్ట్స్ శాఖ అధికారి రాందాస్, జిల్లా వైద్యాధికారి వసంత రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.