ఈ పండ్లు ఎక్కడ కనిపించినా అస్సలు విడిచిపెట్టకండి..

మార్కెట్లో అనేక రకాల పండ్లు కాలానికి సంబంధం లేకుండా లభిస్తూ ఉంటాయి.అలాంటి పనులలో అల్బుకర పండ్లు కూడా ఒకటి.

 Amazing Health Benefites Of Albakara Fruit Details, Health Benefites ,albakara-TeluguStop.com

ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.కొన్ని రకాల అల్బుకర పండ్లు ఊదా రంగులో కూడా ఉంటాయి.

అయితే ఎరుపు రంగులో ఉండే పనులే మనకు ఎక్కువగా మార్కెట్లో లభిస్తూ ఉంటాయి.ఇవి దాదాపు అన్ని సీజన్లోనూ మార్కెట్లో లభిస్తూ ఉంటాయి.

ఈ పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ మనకు అందుబాటులో ఉంటాయి.అల్బుకర పండ్లను జామ్ తయారు చేసుకునేందుకు కూడా ఉపయోగిస్తారు.

వీటిలో రెండో వేలకు పైగా వెరైటీలు ఉన్నాయి.అల్బుకర పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

వీటిని తినడం వల్ల మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి.ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఈ పండ్లు శరీరంలోని వ్యర్ధాలను బయటకి పంపడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అల్బుకరా పండ్లలో క్రోమియం, పొటాషియం, సెలీనియం, వంటి మినరల్స్ తో పాటు విటమిన్ సి కూడా అధిక మొత్తంలో ఉంటుంది.

ఈ పండ్లలో విటమిన్ ఏ, పోలేట్, విటమిన్ కె, విటమిన్ బి1 మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, క్లోరైడ్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఎక్కువగానే ఉంటుంది.వీటిలో ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు, అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ పనులను తినడం ఎంతో మంచిది.

Telugu Albakara Fruit, Albakarafruit, Benefites, Tips-Telugu Health

ఈ పండ్లను రోజు తినడం వల్ల శరీరంలోని కొవ్వు ఐస్ కరిగినట్లు కలుగుతుంది.అల్బుకరా పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.దీనివల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది.ఇంకా చెప్పాలంటే ఈ పండ్లు గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.రక్తనాళాల్లో రక్తం సరఫరా సాఫీగా సాగేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ పండ్లు ప్రతిరోజు తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.

ఎర్ర రక్తకణాల సంఖ్య కూడా రక్తంలో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.అల్బుకర పండ్లు తినడం వల్ల చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube