ఈనెల 21న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న రక్తదాన కార్యక్రమ పోస్టర్, ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
సీఎం బర్త్ డే వేడుకల్లో కోట్లాది మంది అభిమానులతో పాటు సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారంతా పాల్గొంటారన్నారు.గతంలో పార్టీ కార్యకర్తలు 38 వేల యూనిట్ల రక్తదానం చేశారని, ఈసారి వైసీపీ బ్లడ్ డొనేషన్.కామ్ పేరిట వెబ్ సైట్ ప్రారంభించామని చెప్పారు.
వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైనప్పుడు రక్తదానం చేసే అవకాశం ఉంటుందన్నారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాపోటీలు, 20వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం, 21న పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపునిచ్చారు.