అందమైన మెరిసే చర్మాన్ని కావాలని అందరూ కోరుకుంటారు.అందులోనూ ఏదైనా ఫంక్షన్‌కు లేదా మీటింగ్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం చర్మం గ్లోయింగ్‌గా మరియు షైనీగా మెరిసిపోవాలని తెగ తాపత్రయ పడుతుంటారు.
అందుకోసం మార్కెట్లో అందుబాటులో ఉండే ప్రతి ఒక్క ఉత్పత్తిని కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే మార్కెట్‌లో లభ్యమయ్యే ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు గానీ.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే కనుక ఒక్క రాత్రిలో మీ ముఖం గ్లోయింగ్‌గా మరియు షైనీగా మారుతుంది.మరి ఇంకెందుకు లేటు ఈ సింపుల్ రెమెడీ ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ ను పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.
కంప్లీట్ గా కూల్ అయిన అనంతరం ఓ పల్చటి వస్త్రంలో వేసి జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.

అలాగే మరోవైపు ఒక ఆరెంజ్‌ను తీసుకొని సగానికి కట్ చేసి జ్యూస్‌ను తీయాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో తయారుచేసి పెట్టుకున్న అవిసె గింజల జెల్ వేయాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకుని ఐదారు నిమిషాల పాటు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.
రాత్రి నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే పూర్తిగా తొలగించి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్లతో మసాజ్ చేసుకుని నిద్రించాలి.
మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని ట్రై చేస్తే గనుక ఒక్క నైట్‌లో మీ ముఖం గ్లోయింగ్‌గా, షైనీగా మారడం ఖాయం.