విప‌క్షాల‌కు ఇక అధికారం దూరం ఖాయం

తన అద్భుతమైన నాయకత్వ పటిమతో, మచ్చలేని వ్యక్తిత్వం తో భారతదేశాన్ని అన్ని రంగాలలో ఓక బలమైన శక్తిగా తీర్చిదిద్దిడంల, ఓక అసాధారణ,శత్రు దుర్బెద శక్తిగా మలచడంలో నూటికి నూరుపాళ్ళు విజయం సాధించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓక సాధారణ టీ అమ్ముకునే దుకాణం వారి ఇంట 1950 వాద్ నగర్, మెహసానా ( గుజరాత్ ) లో జన్మించారు.

 The Opposition Is Sure To Lose Power Under Prime Minister Narendra Modi Leadersh-TeluguStop.com

ఆయన తన చిన్ననాటి రోజుల్లో వాళ్ళ నాన్న అమ్మే టీ దుకాణానికి సహాయం చేస్తూ, చేదోడు, వాదోడిగా వున్న మోదీ ఆ తరువాత తానే స్వయంగా ఓక టీ దుకాణాన్ని నెలకొల్పాడు.అయితే 8 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి ఆ సంస్థలో చేరారు.

ఆ సంస్థలో అంచె లంచెలుగా ఎదుగుతూ 1985 లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోని ఆ పార్టీ లో చేరారు.ఇక అక్కడి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మోదీజీ తనకున్న వాక్ చాతుర్యం, నాయకత్వ లక్షణాలతో గుజరాత్ రాష్ట్రానికి ఏకంగా బీజేపీ పార్టీ తరపున రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఇక ఆ తరువాత ఆయన రాజకీయ జీవితం ఉప్పందుకుంది,1995 లో ఏకంగా ఆయన బీజేపీ జాతీయ సంస్థ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఓక విధంగా చెప్పాలంటే ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

ఎందుకంటే 1995 తరువాత కాలంలో గుజరాత్ రాష్ట్రం లోని ఓక స్థానానికి శాసన సభ్యునిగా గెలిచి ఏకంగా తన ప్రతిభాసామర్త్యాలతో, ఆ రాష్ట్ర ప్రజల విశేష ఆదరణతో గుజరాత్ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.అలా గుజరాత్ రాష్ట్రాన్ని దాదాపు 14 సంవత్సరాలు అత్యంత అప్రతిహాసంగా, సమర్థవంతంగా, దిగ్విజయంగా పరిపాలన సాగించారు.

ఇక ఆ తరువాత ఎవరు ఊహించని విధంగా 2014 లో ఎంపీ గా ఓక లోకసభ సీటును గెలుచుకొని ఏకంగా మన భారతదేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.

Telugu Bjp, Narendra Modi, Narendramodi, Prime Modi, Primenarendra-Political

దీంతో 1984 తరువాత భారతీయ జనతా పార్టీకి లోకసభ లో అత్యధిక మెజారిటీ తెచ్చిన ఘనతను, గొప్ప చరిత్రను మన ప్రియతమ ప్రధాని మోదీ మూటగట్టుకున్నాడు.తన పేర సువర్ణాక్షరాలతో లీఖించుకున్నాడు.ఆయన ఈ విధంగా అత్యంత విజయవంతంగా రెండో మారు సైతం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు అంటే యావత్ ఈ దేశ ప్రజానీకం ఆయన నాయకత్వం పై అంచె లంచెల నమ్మకం ఉంచడమే.

అలాగే కోట్లాదిమంది భారతదేశ ప్రజానీకం తన మీద పెట్టుకున్న ఆశలను ఏ మాత్రం వమ్ము చేయకుండా భారతదేశాన్ని అన్ని రంగాలలో ఓక బలియమైన శక్తిగా తీర్చిదిద్దడం లో మన ప్రియతమ ప్రధాని చూపిన దృఢదీక్ష,చూపిన ధైర్య సాహసాలు, తెగువ, ఓర్పు, సహన శక్తి నభుతో నాభవిష్యత్ అని చెప్పవచ్చు.

Telugu Bjp, Narendra Modi, Narendramodi, Prime Modi, Primenarendra-Political

ముఖ్యంగా గత పార్టీ ల మాదిరి అరకొర మెజారిటీ తెచ్చుకొని ఇతర చిన్న చితక పార్టీ ల కనుసన్నలతో పాలన సాగించే దౌర్భాగ్యానికి తెరదించుతూ తమ బీజేపీ పార్టీ సాధించిన అఖండ మెజారిటీ తో చాలా స్వేచ్ఛగా, బందుప్రీతికి, అవినీతికి ఆమడ దూరం లో వుంటూ ఓక జనరంజక పాలనను భారతదేశ ప్రజానీకానికి సాక్షాత్కరింప చేస్తూ దేశానికి పాలకుడు అంటే ఇలా ఉండాలి అనేలా ఓక ఆదర్శ పాలనకు నడుము బిగించి ఆశేష భారతదేశ ప్రజల అదరాభిమానాలకు పాత్రుడు కావడమే కాదు, యావత్ ప్రపంచం మన దేశం వైపు చూసేలా తన పరిపాలన సామర్త్యాలను చాలా గొప్ప గా, అన్ని దేశాల నాయకులతో సెభాష్ అనిపించుకునేలా సాగించాడు మన ప్రియతమ ప్రధాని మోదీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube