రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలలో రైతులు అధైర్య పడవద్దని వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలలో గత పది రోజుల నుండి రైతులు వడ్లు కొనుగోలు జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వేములవాడ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.
శుక్రవారం నుండి మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి గిడ్డంగులకు తరలించే విధంగా ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలపడం జరిగిందన్నారు.అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు రైతులను ఈ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని అన్నారు.
రైతులు తొందరపడి దళారులకు తమ పంటను అమ్మ వద్దని విజ్ఞప్తి చేశారు.మంత్రి ,ప్రభుత్వ విప్ ను కలిసిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి వంగ మల్లారెడ్డి,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాటి రామ్ రెడ్డి ,డైరెక్టర్లు తిరుపతి రెడ్డి,మండే శ్రీనివాస్,గంట చిన్న లక్ష్మి బుచ్చ గౌడ్, నాయకులు చెన్ని బాబు, గంగయ్య, నాగరాజు,ఎడ్ల రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.