తల్లి ప్రేమ( Mother’s Love ) అంటే త్యాగం, అపారమైన మమకారం.ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా సహించగలదు.
తల్లి ప్రేమకు సాటి మరేదీ లేదని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.పిల్లలను వారి తల్లి కంటికి రెప్పలా ఉంటారు.
అయితే, కొందరు మాత్రం తల్లి అనే పవిత్రమైన పదానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తుంటారు.వివాహేతర సంబంధాలు, అనుచిత సంబంధాల వల్ల గర్భం దాల్చిన కొందరు, ఆ సంతానాన్ని అంగీకరించకుండా హీనమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.
ఇటువంటి ఓ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ, పైప్‌లైన్( Pipeline ) నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.మొదటగా చిన్న పిల్లవాని ఏడుపులా అనిపించినా, పైప్‌లోంచి ఎలా వస్తుందోనని ఆశ్చర్యపోయారు.అనుమానం రాగానే వెంటనే సమాచారం ఇచ్చి రెస్క్యూ బృందాన్ని అక్కడికి రప్పించారు.రెస్క్యూ బృందం( Rescue Team ) చాలా జాగ్రత్తగా పైపును కట్ చేసి చూడగా, అందులో ఓ నవజాత శిశువు( New Born Baby ) ఏడుస్తూ కనిపించింది.
ఊహించని ఈ ఘటనను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.పిల్లవాడిని బొడ్డు తాడును కూడా కత్తించకుండా పైపులో పడేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.ఇది చూస్తే, అక్రమంగా గర్భం దాల్చిన ఓ మహిళ, తన గర్భాన్ని ఇలా అతి దారుణంగా రక్షించుకోవడానికి ప్రయత్నించిందని స్పష్టమవుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కానీ, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.దీనిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ప్రస్తుత కాలంలో పిల్లలు లేక అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని.మీరు మాత్రం ఇలా చేయడం క్షమించరాని నేరం అంటూ కామెంట్ చేస్తున్నారు.