సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆ రోల్ మిస్సైన సప్తగిరి.. అసలేం జరిగిందంటే?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.( Sankranthiki Vasthunnam ) ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Sankarthiki Vastunam A Blockbuster Sapthagiri Details, Sankranthiki Vasthunnam,-TeluguStop.com

మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్గా నటించిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో నిర్మితమై బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది.కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా విడుదల అయ్యి ఎన్నో రికార్డులను సృష్టించింది.

ఇకపోతే ఇటీవలే మూవీ మేకర్స్ సినిమా విడుదల అయ్యి 50 రోజులు పూర్తి అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

Telugu Anil Ravipudi, Sapthagiri, Tollywood, Venkatesh-Movie

ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఓటీటీ లో సక్సెస్ఫుల్గా ప్రదర్శితం అవుతోంది.అలాగే ప్ర‌స్తుత‌మున్న డిజిట‌ల్ యుగంలో ఏ సినిమా రెండు వారాల‌కు మించి థియేట‌ర్ల‌లో ఆడ‌టం లేదు.అలాంటిది చాలా కాలం త‌ర్వాత సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా థియేట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం గొప్ప విష‌యం అది కూడా ఒక‌టి రెండు సెంట‌ర్ల‌లో కాదు ఏకంగా 92 సెంట‌ర్ల‌లో.

ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి.ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.ఈ సినిమాలో హీరో, కమెడియన్ సప్తగిరి( Sapthagiri ) నటించాల్సిందట.

Telugu Anil Ravipudi, Sapthagiri, Tollywood, Venkatesh-Movie

ఇదే విషయమే స్వయంగా సప్తగిరి చెప్పుకొచ్చారు.సప్తగిరి నటించిన లేటెస్ట్ మూవీ పెళ్ళికాని ప్రసాద్.( Pelli Kani Prasad ) ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అనిల్ రావిపూడి, స‌ప్త‌గిరి మంచి ఫ్రెండ్స్.కెరీర్ స్టార్టింగ్ నుంచి అనిల్ నాకు బాగా తెలుసు.అప్పుడెలా ఉన్నాడో ఇప్ప‌టికీ నాతో అలానే ఉన్నాడు.

ఇద్ద‌రం క‌లిస్తే ఎన్నో స‌రదా క‌బుర్లు చెప్పుకుంటాము.కానీ ఇప్ప‌టివ‌ర‌కు మా క‌ల‌యిక‌లో ఒక్క సినిమా కూడా రాలేదు.

వాస్త‌వానికి నేను సంక్రాంతికి వ‌స్తున్నాంలో న‌టించాల్సి ఉంది అని స‌ప్తగిరి తెలిపారు.ఈ సందర్బంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube