వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం భారతీయులు విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే దేశం కానీ దేశంలో వారు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఓ వ్యక్తి పరాయి దేశంలో భారతీయ విద్యార్ధులు ఎదుర్కొనే కఠినమైన వాస్తవాలను బహిర్గతం చేస్తూ తాను కెనడాకు (canada)వెళ్లిన తర్వాత ఎదుర్కొన్న అంశాలపై కీలక విషయాలను పంచుకున్నాడు.తాను కెనడాకు ఎందుకు వెళ్లానా అని చింతిస్తున్నానని ఆ వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం కెనడాలో(canada) నివసిస్తున్న ఆ వ్యక్తి.పశ్చిమ దేశాలలో సంపన్నమైన జీవితం అనేది ఒక భ్రమ తప్పించి మరొకటి కాదని వలసదారులను హెచ్చరించాడు.
కెనడా ప్రభుత్వం , అక్కడి విద్యాసంస్థలు వ్యాపార సాధనంగా పిలిచే అంతర్జాతీయ విద్యార్ధులను ఎలా దోపిడి చేస్తున్నారో అతను కళ్లకు కట్టినట్లుగా వివరించాడు.చాలా మంది విద్యార్ధులు అధిక ఫీజులు వసూలు చేస్తూ నాసిరకం విద్యను అందించే ప్రైవేట్ లేదా తక్కువ ర్యాంక్ ఉన్న సంస్థలలో చేరుతున్నారని చెప్పాడు.
ఆ విద్యాసంస్థలలో ప్రొఫెసర్లు చాలా కష్టపడతారని, పాఠ్యాంశాలు చాలా పాతవని.ఆ డిగ్రీలు జాబ్ మార్కెట్‌కు పనికిరావని తెలిపాడు.

తాను బో వ్యాలీ కాలేజీకి (Bow Valley College)వెళ్లానని.ఇది కాల్గరీలోని చెత్త విద్యాసంస్థ అని అద్దె చెల్లించడానికి ఉబర్, వేర్‌హౌస్ లేబర్, రిటైల్ (Uber, Warehouse Labor, Retail)వంటి ఉద్యోగాలలోకి బలవంతంగా వెళ్లాల్సి వస్తుందని ఆయన చెప్పాడు.ఈలోగా మీరు కెరీర్‌లో ఎలాంటి వృద్ధి లేకుండా అప్పుల్లో మునిగిపోతారని హెచ్చరించాడు.కెనడాలో జీవన వ్యయం చాలా ఎక్కువని, ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతాయని, కిరణా సామాగ్రి ధరలు కూడా ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నాడు.
చాలా మంది విద్యార్ధులు తమ మనుగడ కోసం కనీస వేతన సమయాన్ని మించి పనిచేస్తున్నారని ఆ ఎన్ఆర్ఐ వాపోయాడు.

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.చాలా మంది యూజర్లు ఆ వ్యక్తి చెప్పినదానికి ఏకీభవిస్తున్నారు.మరికొందరు మాత్రం ఇప్పటికీ భారత్ కంటే కెనడా మెరుగైన అవకాశాలను అందిస్తుందని వాదిస్తున్నారు.
ప్రతిరోజూ భారత్‌లోని కొందరు విదేశాలకు వలస వెళ్లాలని కలలు కంటూ మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతుంటారని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.