మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రస్తుతం కన్నప్ప ( Kannappa ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మంచు విష్ణు అల్లు అర్జున్ ( Allu Arjun ) అరెస్ట్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.పుష్ప 2( Pushpa 2 ) విడుదల సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనని చూడటం కోసం రావడంతో తొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి( Revathi ) అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే ఈ విషయంపై అల్లు అర్జున్ పట్ల కేసు నమోదు కావటం పోలీసులు తనని అరెస్టు చేసి తీసుకెళ్లడం జరిగింది.అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందించారు కానీ ఈ విషయంపై తెలంగాణ సర్కార్ సీరియస్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం మౌనం పాటించారు.ఇలా అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ మౌనంగా ఉండటానికి గల కారణాన్ని మంచి విష్ణు తెలిపారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ మౌనంగా ఉండటానికి కారణం లేకపోలేదు.తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు అంటూ ఇండస్ట్రీ నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలిపారు.
సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటూ మన పనులు మనం చేయించుకోవాలని మంచు విష్ణు తెలిపారు.తమకు కావాల్సిన బెనిఫిట్స్ ని రిక్వెస్ట్ చేయాలన్నారు మంచు విష్ణు.
ఎప్పుడూ ఏ ప్రభుత్వాన్ని పరిశ్రమ విమర్శించదు, వ్యతిరేకంగా మాట్లాడదని స్పష్టం చేశారు.అందుకే బన్నీ వివాదం విషయంలో అంతా సైలెంట్‌గా ఉన్నారని చెప్పారు.