ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో( Meerut ) గుండెలు పిండేసే ఘటన వెలుగులోకి వచ్చింది.సౌరభ్ రాజ్‌పుత్( Sourabh Rajput ) అనే 29 ఏళ్ల మెర్చంట్ నేవీ ఉద్యోగిని( Merchant Navy Officer ) స్వయంగా కట్టుకున్న భార్యే కడతేర్చింది.
అంతేకాదు, ఆమె ఒక్కతే ఈ ఘాతుకానికి ఒడిగట్టలేదు.తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే, లండన్‌లో( London ) ఉద్యోగం చేస్తున్న సౌరభ్, ఫిబ్రవరి 28న తన కూతురు పుట్టినరోజు కోసం ఇంటికి వచ్చాడు.ఆ సంతోషం ఆవిరి కాకముందే, మార్చి 4న అతని భార్య ముస్కాన్ (27),( Muskaan ) ఆమె ప్రియుడు సాహిల్ (25)( Sahil ) కలిసి సౌరభ్ ను కత్తితో పొడిచి చంపేశారు.
చంపడమే కాకుండా, అతని శరీరాన్ని ఏకంగా 15 ముక్కలుగా నరికేశారు.ఆ తర్వాత ఆ ముక్కలన్నింటినీ ఒక డ్రమ్ములో వేసి, సిమెంట్‌తో కప్పేశారు.

సినిమా స్టైల్లో క్రైమ్ చేసిన ఈ జంట, ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు విహారయాత్రకు మనాలి చెక్కేశారు.సౌరభ్ హత్యను కప్పిపుచ్చడానికి ముస్కాన్ అతని ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లను వాడింది.అతను క్షేమంగా ఉన్నాడని నమ్మించేలా కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పెట్టింది, ఫొటోలు షేర్ చేసింది.
అయితే, సౌరభ్ ఎంతకూ ఫోన్ ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.పోలీసులు ముస్కాన్, సాహిల్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా.
నేరం అంగీకరించారు.సౌరభ్ శరీర భాగాలను వెలికితీసి పోస్ట్ మార్టం కోసం పంపారు.

సౌరభ్, ముస్కాన్ ప్రేమించి 2016లో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత ముస్కాన్ కోసం సౌరభ్ మెర్చంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలేశాడు.కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.దీంతో మీరట్‌లోని ఇందిరా నగర్ ఫేజ్ 1లో అద్దె ఇంట్లో వేరుగా కాపురం పెట్టారు.2019లో వారికి పాప పుట్టింది.
కొంతకాలం తర్వాత ముస్కాన్‌కు సాహిల్‌తో వివాహేతర సంబంధం ఉందని సౌరభ్ తెలుసుకున్నాడు.
దీంతో వారి మధ్య గొడవలు జరిగాయి.చివరికి సౌరభ్ మళ్లీ మెర్చంట్ నేవీలో చేరాలని నిర్ణయించుకున్నాడు.
కుటుంబాన్ని సర్‌ప్రైజ్ చేద్దామని ఇంటికి తిరిగి వచ్చిన సౌరభ్ ను దారుణంగా హత్య చేశారు.సౌరభ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.