తొమ్మిది రోజులపాటు గడ్డకట్టే నీళ్లలో ఆగకుండా ఈదుతూ ఉండటం అసాధ్యం కదా, కానీ ఒక ఆడ ధృవపు ఎలుగుబంటి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది.అలాస్కాకు( Alaska ) ఉత్తరాన ఉన్న మంచుగడ్డ కట్టిన బ్యూఫోర్ట్ సముద్రం మీదుగా ఏకంగా 687 కిలోమీటర్లు ఒక్క బ్రేక్ లేకుండా ఈదింది.
ఈ అద్భుతమైన ప్రయాణాన్ని శాస్త్రవేత్తలు 2011లోనే గుర్తించారు.కానీ ఆ ఎలుగుబంటి( Bear ) ఈత కొడుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ వైరల్( Viral ) కావడంతో, వాతావరణ మార్పులు, వన్యప్రాణులపై దాని ప్రభావం గురించి చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
ఎక్స్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, ఎలుగుబంటి మంచు నీటిలో ఈదుతూ ఉండటం ఏరియల్ వ్యూలో రికార్డ్ చేశారు.2008లోనే US జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు ఈ ఎలుగుబంటికి రేడియో కాలర్ అమర్చారు.ఆ రేడియో కాలర్ ద్వారానే ఈ తొమ్మిది రోజుల ప్రయాణాన్ని ట్రాక్ చేశారు.ఆహారం కోసం, మంచుగడ్డ కోసం వెతుకుతూ అది చేసిన నిస్సహాయ ప్రయత్నంలో భాగంగానే ఈ సుదీర్ఘ ఈత సాగింది.
అయితే, 687 కి.మీ ఈతతో దాని కష్టాలు తీరలేదు.ముక్కలు ముక్కలుగా ఉన్న మంచును చేరుకున్నాక కూడా అది ఆగలేదు.ఆహారం కోసం, కొత్త మంచుగడ్డ కోసం నీళ్లలో, నేలమీద మరో 1,800 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూనే ఉంది.
విశ్రాంతి, ఆహారం లేకపోవడంతో దాని ఆరోగ్యం బాగా దెబ్బతింది.ఈ కష్టమైన ప్రయాణంలో అది దాదాపు 20% శరీర బరువును కోల్పోయింది.
ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లను షాక్ కి గురి చేసింది.చాలామంది ఎలుగుబంటి ఓర్పును చూసి ఆశ్చర్యపోయారు.ఒక యూజర్ కామెంట్ చేస్తూ, “అది ఎలా అలసిపోకుండా ఉండగలిగింది?” అని అడిగారు.మరొకరు రాస్తూ, “ధృవపు ఎలుగుబంట్లు నిజంగా అద్భుతమైన జంతువులు” అని అన్నారు.
ఈ వీడియో ఆర్కిటిక్ జంతువులు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను గుర్తు చేస్తుంది.వాతావరణ మార్పుల వల్ల సముద్రపు మంచు కరిగిపోతుండటంతో, ధృవపు ఎలుగుబంట్లు మనుగడ సాగించడం మరింత కష్టతరమవుతోంది, అవి ఎక్కువ దూరం ఈదవలసి వస్తోంది.