ఒడిస్సా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబి 29.... స్పీడ్ మీద ఉన్న జక్కన్న!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ఎస్ఎస్ఎంబి (SSMB29) అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

 Ssmb 29 Wrap Up Orissa Shedule Photos Goes Viral , Ssmb 29, Mahesh Babu, Rajamou-TeluguStop.com

ఇక ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోందని తెలుస్తోంది.ఇప్పటికే హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్నారు.

అయితే ఇక్కడ ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర బృందం ఒరిస్సా వెళ్లారు.ఇలా ఒరిస్సాలో రెండో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది.

గత 15 రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో నడుస్తోంది.సిమిలిగుడకు సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ (Mali, Putsiel, Balda)తదితర ప్రాంతాల్లో నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక మంగళవారం సాయంత్రం ఇక్కడ ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే అక్కడ వీరిని చూడడం కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో చిత్ర బృందం వీరితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Balda, Mahesh Babu, Mali, Priyanka Chopra, Putsiel, Rajamouli, Ssmb-Movie

ఇక ఈ షెడ్యూల్ షూటింగ్లో భాగంగా మహేష్ బాబుతో పాటు పృధ్విరాజ్ సుకుమారన్, నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా పాల్గొన్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ తిరిగి హైదరాబాదులోనే షూటింగ్ జరుపుకోబోతుందని తెలుస్తుంది.ఇలా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో మొదటిసారి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.అంతేకాకుండా ఈ సినిమాని రాజమౌళి శరవేగంగా షూటింగ్ పనులను జరుపుతున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube