ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి( Priyadarshi, Roshan, Sridevi ) ప్రధాన పాత్రల్లో నాని నిర్మాతగా తెరకెక్కిన కోర్ట్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా 33 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఈ సినిమా షేర్ కలెక్షన్ల విషయానికి వస్తే 13 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.చిన్న సినిమాల్లో ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది.
ఈ సినిమాకు జరిగిన బిజినెస్ తో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం.రాబోయే రోజుల్లో ఈ సినిమా భారీ స్థాయిలో లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది.
ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా 8 లక్షల డాలర్లను సొంతం చేసుకోవడం గమనార్హం.త్వరలో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ మార్క్ ను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.కోర్ట్ సినిమాకు సీక్వెల్ సైతం ఒకింత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కనుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.నాని ఈ సినిమాకు నిర్మాత కాగా నిర్మాతగా కూడా నాని అభిరుచి చాటుకుంటున్నారు.

న్యాచురల్ స్టార్ నాని మే నెలలో హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.హిట్3 సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.హిట్3 సినిమా గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.హిట్3 సినిమా పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్ 54 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.