సాధారణంగా బేబీ కార్న్‌తో అనేక రకాల వంటలను చేసుకొని తింటూ ఉంటాం.కానీ బేబీ కార్న్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనలో చాలా మందికి తెలియదు.
బేబీ కార్న్ లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి.మనం తరచుగా బేబీ కార్న్ తింటూ ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు.
వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
బేబీ కార్న్‌లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఐరన్,
విటమిన్ సిలు సమృద్ధిగా ఉండుట వలన మన శరీరానికి చక్కని పోషణను ఇవ్వటమే
కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంను కలిగిస్తాయి.
బేబీ కార్న్ లో చాలా తక్కువగా కేలరీలు ఉంటాయి.100 గ్రాముల బేబీ కార్న్
తింటే మన శరీరానికి 26 కేలరీలు మాత్రమే అందుతాయి.కాబట్టి బరువు తగ్గాలని
అనుకొనే వారు బేబీ కార్న్ తినవచ్చు.

బేబీ కార్న్ లో పీచు పదార్ధం సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చక్కర
స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
అంతేకాక జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్దకం,అజీర్ణం వంటి సమస్యలు
కూడా తగ్గుతాయి.
బేబీ కార్న్‌లో కెరోటినాయిడ్స్ అనే పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలను తగ్గిస్తుంది.
కంటి సమస్యలు ఉన్నవారు బేబీ కార్న్ తింటే మంచి
ఫలితం ఉంటుంది.
బేబీ కార్న్ లో ఫోలేట్ అనే పోషక పదార్థం సమృద్ధిగా ఉండుట వలన గర్భిణి స్త్రీలకు మేలు చేస్తుంది.
శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది.అందువల్ల గర్భిణి స్త్రీలు బేబీ కార్న్ తింటే మంచిది.