ఛావా మూవీ క్రియేట్ చేసిన 8 క్రేజీ రికార్డులు ఇవే.. ఇప్పట్లో ఈ రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?

శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఛావా మూవీ( Chhaava Movie ) బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.విక్కీ కౌశల్( Vicky Kaushal ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.

 Vicky Kaushal 8 Crazy Records Chhaava Details, Vicky Kaushal , Chhaava Movie Rec-TeluguStop.com

భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.ఫిబ్రవరి నెల 14వ తేదీన థియేటర్లలో విడుదలైన ఛావా ఇప్పటివరకు 562 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

తెలుగులో ఈ సినిమా ఏకంగా 13 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.బుక్ మై షోలో 12 మిలియన్ టికెట్లు విక్రయమైన తొలి హిందీ మూవీగా ఛావా నిలిచింది.

ఈ సినిమా ఈ ఏడాది విడుదలై హిట్ గా నిలిచిన స్త్రీ2( Stree 2 ) రికార్డును సైతం బ్రేక్ చేయడం గమనార్హం.ఈ ఏడాది గ్రాస్ కలెక్షన్ల విషయంలో సైతం ఈ సినిమా హిట్ కావడం గమనార్హం.

Telugu Chhaava, Chhaava Telugu, Pushpa, Streeuri, Vicky Kaushal, Vickykaushal-Mo

విక్కీ కౌశల్ గత సినిమాల కలెక్షన్ల రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది.ఐదో వీకెండ్ లో సైతం 22 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి స్త్రీ2, పుష్ప2( Pushpa 2 ) రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది.22 రోజుల్లో 500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ఈ సినిమా నిలిచింది.హిందీ సినిమాల్లో సెకండ్ వీక్ లో 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచింది.

Telugu Chhaava, Chhaava Telugu, Pushpa, Streeuri, Vicky Kaushal, Vickykaushal-Mo

విక్కీ కౌశల్ కెరీర్ లో తొలిరోజు కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టించింది.విక్కీ కౌశల్ ఉరి సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేసింది.విక్కీ కౌశల్ వాలంటైన్స్ డే రోజున విడుదలై అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమాతో రికార్డ్ అందుకున్నారు.విక్కీ కౌశల్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube