టాలీవుడ్ ఇండస్ట్రీలోని నంబర్ వన్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్( Sekhar Master ) అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.కెరీర్ తొలినాళ్లలో వరుస ఆఫర్లతో సత్తా చాటిన శేఖర్ మాస్టర్ ఈ మధ్య కాలంలో బోల్డ్ స్టెప్పులతో విమర్శల పాలవుతున్నారు.
ఆయన డ్యాన్స్ స్టెప్పుల విషయంలో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నా ఆయన తీరు మాత్రం మారడం లేదనే సంగతి తెలిసిందే.
అయితే శేఖర్ మాస్టర్ డాన్స్ స్టెప్పులపై పరోక్షంగా వార్నింగ్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్( Telangana State Women Commission ) మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్ ను వెంటనే నిలిపివేయాలి అంటూ పేర్కొంది.తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రాబిన్ హుడ్ సినిమా( Robinhood Movie ) గురించి పరోక్షంగా ప్రస్తావించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

శేఖర్ మాస్టర్ మాత్రం తనపై వచ్చిన వస్తున్న విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు.మరోవైపు ఈ వివాదం గురించి కేతిక శర్మ( Ketika Sharma ) కూడా రియాక్ట్ కాలేదు.కేతిక శర్మ కెరీర్ కు ఈ సాంగ్ కెరీర్ పరంగా ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.కేతిక శర్మ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది.

ఈ సాంగ్ కోసం కేతిక శర్మ ఒకింత భారీ స్థాయిలో పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది.శేఖర్ మాస్టర్ రాబోయే రోజుల్లో ఈ విమర్శలు రిపీట్ కాకుండా వ్యవహరిస్తారేమో చూడాలి.రాబిన్ హుడ్ సినిమాకు ఈ సాంగ్ ప్లస్ అవుతుందో లేదో చూడాలి.70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబిన్ హుడ్ తెరకెక్కింది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.