1.బిజెపికి రాజీనామా చేస్తున్నా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తప్పనిసరి పరిస్థితుల్లోని బిజెపికి రాజీనామా చేస్తున్నాను.కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
2.విజయ్ సాయి రెడ్డి పై పురందరేశ్వరి విమర్శలు
ఏపీలోని డిస్ట్లారీ ల యజమానుల వివరాలు కానీ ప్రభుత్వం స్పందించలేదని , ఆదాన్ కంపెనీ వెనుక వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఉన్నారని, ఏపీ టీడీపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు.
3.గజ్వేల్ కు ఈటల రాజేందర్
హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రేపు గజ్వేల్ కు రానున్నారు.
4.రేపటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర
అక్టోబర్ 26 నుంచి సామాజిక సాధికార యాత్ర పేరుతో ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ బస్సు యాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.
5.నేడు పోలవరంలో మంత్రి అంబటి పర్యటన
నేడు పోలవరం ప్రాజెక్టును ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించనున్నారు.
6.నారా భువనేశ్వరి బస్సు యాత్ర
నిజం గెలవాలి పేరుతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి చంద్రగిరిలో బస్సు యాత్ర మొదలుపెట్టారు.
7.మంచిర్యాలలో ఫ్లాగ్ మార్చ్
తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతాపరంగా మంచిర్యాల ఐబి నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.
8.చంద్రబాబు అరెస్ట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసి తీవ్రంగా హింసించి ఇబ్బందులకు గురిచేయడం జగన్ ప్రభుత్వానికి సరైనది కాదు అని డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్య నాయక్ అన్నారు.
9.కెసిఆర్ రెండో విడత ఎన్నికల ప్రచార యాత్ర
బీ అర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అక్టోబర్ 26 నుంచి ఎన్నికల ప్రచారాన్ని పునః ప్రారంభించనున్నారు.
10.ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ఉపన్యాసం
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం లో ఆర్థిక శాస్త్రం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపన్యాసం చేసేందుకు ఆమెకు ఆహ్వానం అందింది.
11.కాంగ్రెస్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు
ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పని అని మండలి చైర్మన్ గుప్త సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
12.జైలర్ మూవీ విలన్ అరెస్ట్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయక్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.మద్యం మత్తులో తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు.
13.నేడు ఢిల్లీలో బీజేపీ నేతలతో పవన్ భేటీ
తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై చర్చించేందుకు ఆ పార్టీ అగ్ర నేతలను కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు.
14.ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ లో చాలామంది చేరుతున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
15.మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం నాణ్యత పై కేంద్ర బృందం విచారణ
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నాణ్యత పై కేంద్ర బృందం పరిశీలనకు వచ్చింది.
16.చంద్రబాబు అరెస్టుపై చింతా మోహన్ కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబును 50 రోజులు జైల్లో పెట్టి ఏం సాధించారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ప్రశ్నించారు.
17.కొడాలి నాని విమర్శలు
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు నిజం గెలిసింది కాబట్టి చంద్రబాబు జైల్లో ఉన్నారని నాని ఎద్దేవా చేశారు.
18.మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
19. నేడు ఢిల్లీకి బిజెపి ముఖ్య నేతలు
అధిష్టానం పిలుపుమేరకు తెలంగాణ బిజెపి ముఖ్య నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
20.ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి.