మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఇటీవల ఈ సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు బయటకు రావడంతో సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచుతుంది.
ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ కి జోడిగా నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈమె కూడా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వి కపూర్ అనంతరం రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు.ఇలా రామ్ చరణ్ ఇంటికి వెళ్లినటువంటి ఈమెకు చరణ్ వైఫ్ ఉపాసన( Upasana ) జాన్వి కపూర్ కోసం ఒక గిఫ్ట్ ఇచ్చారు.ఉపాసన తన అత్తయ్య సురేఖతో కలిసి అత్తమ్మ కిచెన్స్ అంటూ ఇన్స్టెంట్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే అత్తమ్మ కిచెన్స్ నుంచి వివిధ రకాల ఫుడ్ ప్యాకెట్లను సెలెబ్రిటీలకు అందజేస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే ఉపాసన జాన్వీ కపూర్ కు కూడా అత్తమ్మ కిచెన్స్ నుంచి పలు ఇన్‌స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్ ఉన్న గిఫ్ట్ బాక్స్ జాన్వీకి ఇచ్చింది.ఈ ఫోటోని ఇప్పుడు అత్తమ్మస్ కిచెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఈ ఫోటో పోస్ట్ చేసి RC16 సెట్స్ లో ఏం వండుతున్నారో తెలుసా.
వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేసారు.దీంతో త్వరలో RC16 సెట్స్ నుంచి ఉపాసన ఏదైనా మేకింగ్ వీడియోని షేర్ చేస్తారేమోనని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.