మనలో అధిక శాతం మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు.ఆమ్లెట్, కర్రీ… ఇలా ఏ రూపంలోనైనా ఎగ్స్‌ను తింటారు.
అయితే మన శరీరానికి వాటి నుంచి సంపూర్ణ పోషకాలు అందాలంటే మాత్రం ఉడకబెట్టిన గుడ్లను మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు.ఈ విషయం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో బాయిల్డ్ ఎగ్స్‌ను తినేందుకు అధిక శాతం మంది కూడా ఆసక్తిని ప్రదర్శిస్తారు.అక్కడి వరకు బాగానే ఉన్నా గుడ్లను ఎంతసేపు ఉడకపెట్టాలి అనేది ఇప్పుడు అసలు విషయం.
ఒక కోడిగుడ్డు ఉడికేందుకు మహా అయితే ఎంత సమయం పడుతుంది.? 10 లేదా 15 నిమిషాలు… అదీ.మనం పెట్టే మంటను బట్టి కూడా ఉంటుంది.కానీ అసలు గుడ్డును సరిగ్గా ఎన్ని నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా.? ఇదే విషయంపై జె.కెంజీ లోపెజ్-ఆల్ట్ అనే ఓ అమెరికన్ చెఫ్ ప్రయోగం చేశారు.ఆయన ఏం చెబుతున్నారంటే…
గుడ్డును ఉడకబెట్టే కొద్దీ ఒక్కో నిమిషానికి అందులో వచ్చే మార్పులను ఆయన రికార్డ్ చేశారు.
గుడ్డును ఉడకబెట్టినప్పుడు 1 నుంచి 3 నిమిషాలలో గుడ్డు ఇంకా పచ్చిగానే ఉంటుంది.కానీ పచ్చ సొన విడిపోయి ద్రవంగా మారుతుంది.తెల్లసొన అలాగే జిగురుగా ఉంటుంది.5 నుంచి 7 నిమిషాల్లో గుడ్డు పచ్చ సొన గట్టిగా మారుతుంది.కానీ తెల్లసొన ఇంకా ద్రవంగానే ఉంటుంది.9 నుంచి 11 నిమిషాల్లో పచ్చ సొన బాగా ఉడుకుతుంది.తెల్లసొన గట్టిగా మారుతుంది.జిడ్డుగా ఉంటుంది.13 నుంచి 15 నిమిషాల్లో గుడ్డు బాగా ఉడుకుతుంది.తెల్ల, పచ్చ సొనలు రెండూ హార్డ్ బాయిల్ అవుతాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని సదరు చెఫ్ ఏమంటున్నారంటే… ఒక కోడిగుడ్డును హార్డ్ బాయిల్ చేసేందుకు కనీసం 13 నిమిషాల సమయం పడుతుందట.అదీ ఎక్కువ మంట పెడితే 9 నిమిషాల్లోనే గుడ్డు ఉడుకుతుందని అంటున్నారు.కనుక హార్డ్ బాయిల్ ఎగ్ తినాలనుకునే వారు కనీసం 13 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తే చాలట.